Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం

Update: 2025-04-24 01:16 GMT
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం
  • whatsapp icon

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీ, యానం, రాయలసీమలో వచ్చేవారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఉరుములు, మెరుపుల కూడా వస్తాయని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని..ఒక్కోసారి గంటకు 50కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఐఎండీ ప్రకారం ఏప్రిల్ 24న గురువారం నాడు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడి ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఏప్రిల్ 24 నుంచి ఆదివారం 28 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో వాతావరణం అస్థిరంగా ఉండవచ్చని తెలిపింది. అక్కడక్కడ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలో నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ మేఘావ్రుత వాతావరణంతోపాటు సాయంత్రం వేళల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

ఇక ఏపీ, తెలంగాణలో ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశం లేదు. సాయంత్రం 5 తర్వాతే హైదరాబాద్ చుట్టుపక్కల జల్లులు కురిసే అవకాశం ఉంది. రోజంతా రెండు రాష్ట్రాల్లో మేఘాలు కూడా తక్కువగానే ఉంటాయి. మొత్తానికి భారీ వర్షాలు లేనప్పటికీ ఎండలు మాత్రం భారీగా ఉండనున్నాయి. ఎంత నీళ్లు తాగినా దాహం వేస్తూనే ఉంటుంది. వడదెబ్బ తగులుతుంది. వీలైనంత వరకు ఎండల్లో పనులు పెట్టుకోకూడదు.

Tags:    

Similar News