Rain Alert: ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్..నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rain Alert: గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం స్రుష్టించింది. పలు చోట్ల వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాద్ నగరం భారీ వర్షానికి తడిసి ముద్దైంది. ఎక్కడ చూసిన నీళ్లు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 23 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
పలు చోట్లఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగాఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. తెలంగాణలోని ములుగు, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సిద్ధిపేట, నల్లగొండ, సూర్యపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇక ఏపీలో కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి చెట్లు నేలకొరిగాయి. ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.