Rajiv Yuva Vikasam Scheme: యువతకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్

Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పథం దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14,2025 వరకు పొడిగించింది. ఈ స్కీము ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించబోతోంది. దీన్ని రూ. 10,000కోట్ల బడ్జెట్ తో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ స్కీము దరఖాస్తు విధానం, అర్హతలు, లాభాలు, సబ్సిడీల వివరాల గురించి తెలుసుకుందాం.
మొదట ఏప్రిల్ 5 వరకు ఉన్న దరఖాస్తు గడువును యువత నుంచి వచ్చిన భారీ ఆదరణను ద్రుష్టిలో ఉంచుకుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏప్రిల్ 14 వరకు పెంచాలని ఆదేశించారు. మార్చి 31న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ స్కీము అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ పొడిగింపు ద్వారా మరింత మంది యువతకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
(https://tgobmms.cgg.gov.in).
2. "రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్" ఎంపికపై క్లిక్ చేయండి.
3. ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి వివరాలతో రిజిస్టర్ చేయాలి.
4. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లు (రేషన్ కార్డు, పాన్ కార్డు, ఫోటో) అప్‌లోడ్ చేయాలి.
5. సమీక్షించి "సబ్మిట్" బటన్ నొక్కాలి.
ఎలాంటి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదు. రేషన్ కార్డు ఉంటే చాలు. ఇది దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తుంది.
ఈ స్కీము ద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు. రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. దీనిలో సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు ఉంటాయి.
- స్వంత వ్యాపారం: యువత స్వంతంగా చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించవచ్చు.
- ఆర్థిక స్వాతంత్ర్యం: ఉపాధి కల్పన ద్వారా ఆర్థికంగా స్థిరత్వం సాధించవచ్చు.
- శిక్షణ: ఎంపికైన వారికి పారిశ్రామిక శాఖ ద్వారా వ్యవస్థాపక శిక్షణ అందిస్తారు.
- స్థానిక ఆర్థిక వృద్ధి: చిన్న వ్యాపారాల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం.
అర్హతలు ఏంటి?
ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.
- నివాసం: తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
- వయస్సు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- సామాజిక వర్గం: SC, ST, BC, మైనారిటీ, లేదా EWS/EBC సామాజిక వర్గాలకు చెందినవారై ఉండాలి.
- ఉపాధి స్థితి: ప్రస్తుతం నిరుద్యోగిగా ఉండాలి.
- ప్రయోజనం: స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కోరుతూ ఉండాలి.
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు:
రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలు, సబ్సిడీలు ఈ విధంగా ఉంటాయి:
- రూ. 50,000 వరకు: 100% సబ్సిడీ (పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది).
- రూ. 50,001 - రూ.1 లక్ష: 90% సబ్సిడీ, 10% బ్యాంకు రుణం.
- రూ. 1,00,001 - రూ.2 లక్షలు: 80% సబ్సిడీ, 20% బ్యాంకు రుణం.
- రూ. 2,00,001 - రూ.4 లక్షలు: 70% సబ్సిడీ, 30% బ్యాంకు రుణం.
ఈ లోన్స్ ఎలాంటి కొలాటరల్ (ఆస్తి హామీ) అవసరం లేదు. తక్కువ వడ్డీ రేట్లతో సౌలభ్యం కల్పిస్తారు. ఎంపికైన దరఖాస్తుదారులకు జూన్ 2, 2025 (తెలంగాణ ఆవిర్భావ దినం) నాడు రుణ ఆమోద పత్రాలు అందజేస్తారు.
అమలు ప్రక్రియ:
- దరఖాస్తు స్వీకరణ: మార్చి 17 నుంచి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
- పరిశీలన: ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ ఉంటుంది.
- ఆమోదం: జూన్ 2న ఎంపికైన వారికి లోన్స్, సబ్సిడీలు మంజూరు అవుతాయి.
- పర్యవేక్షణ: ప్రతి జిల్లాలో యువత అధికారి నియామకంతో పథకం అమలును పర్యవేక్షిస్తారు.