పెద్దపల్లి జిల్లాలో మనసును కట్టిపడేస్తున్న వృద్ధ జంట
Old Couple: చాలా మంది దంపతులు వివాహమైన కొత్తలో సంతోషంగానే ఉంటారు. కానీ వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నెలలు కూడ గడవకుండానే గొడవ పడుతుంటారు.
Old Couple: చాలా మంది దంపతులు వివాహమైన కొత్తలో సంతోషంగానే ఉంటారు. కానీ వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నెలలు కూడ గడవకుండానే గొడవ పడుతుంటారు. చీటికీమాటికీ ఒకరిపై ఇంకొకరు నిందలు వేసుకుంటూ వాగ్వాదాలకు దిగుతుంటారు. ఈ గొడవలు చివరకు చిలికి చిలికి గాలివానలా మారి... జీవితాలను కూడా నాశనం చేస్తుంటాయి. అయితే వైవాహిక జీవితానికి చక్కటి అర్థాన్ని చెబుతున్నారు ఓ వృద్ధ దంపతులు.
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన మల్లయ్య, కనకమ్మ అనే వృద్ధ దంపతులు ఉన్నంతలో బతుకుతూ..ఒకరికొకరు తోడు నిలుస్తూ ఆదర్శ జీవనాన్ని గడుపుతున్నారు. నడవడం సైతం కష్టంగా ఉన్నా తన భర్యను సైకిల్‌పై ఎక్కించుకొని సైకిల్‌ను నెట్టుకుంటూ...దవాఖానకు తీసుకెళ్తున్నాడు. సైకిల్ తోక్కే శక్తి లేకపోయినప్పటికి సైకిల్ వెనుక కూర్చోబెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుండడం అనోన్య జీవితానికి అద్దంపడుతున్నది ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలని పలువురు కొరుతున్నారు.