సీరియల్ ఎన్‌కౌంటర్స్... తెలంగాణలో 86 మంది ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల లొంగుబాటు

Chhattisgarh Maoists surrendered before Telangana Police: తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన 86 మంది ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టులు

Update: 2025-04-05 14:04 GMT

ఛత్తీస్‌గఢ్‌లో సీరియల్ ఎన్‌కౌంటర్స్... తెలంగాణలో 86 మంది మావోయిస్టుల లొంగుబాటు

Chhattisgarh Maoists surrendered in Telangana: ఛత్తీస్‌గఢ్‌లో సీరియల్ ఎన్‌కౌంటర్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్ట్ కార్యకలాపాల్లో పాల్గొంటున్న 86 మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులలో 20 మంది మహిళా నక్సలైట్స్ కూడా ఉన్నారు. లొంగిపోయిన వారిని సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఆయుధాలు వదిలేసి జన జీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున తక్షణ ప్రోత్సాహం అందించారు.

ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటన

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. దంతెవాడ జిల్లాలో జరుగుతున్న గిరిజన సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ అమిత్ షా వచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టులు ఎప్పుడూ ఎన్‌కౌంటర్ అయినా ఎవ్వరికీ ఆనందంగా అనిపించదు అని అన్నారు.

మావోయిస్టులను 'లాల్ ఆతంక్'గా అభివర్ణించిన అమిత్ షా, 2026 మార్చి నాటికి ఇండియాలో మావోయిజం లేకుండా చూడాలనే లక్ష్యంతో బీజేపి పనిచేస్తున్నట్లు చెప్పారు. 2024 లో 881 నక్సలైట్స్ లొంగిపోయారు. ఈ ఏడాది గత మూడు నెలల్లో 521 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ లో మావోయిజం చివరి అంచుల్లో ఉందన్నారు. రాబోయే రోజుల్లో బస్తర్ అంటే భయం కాదు... భవిష్యత్ కు చిహ్నంగా మారుస్తామని అమిత్ షా అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News