Shakeel Arrest: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
Shakeel Arrest: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Shakeel Arrest: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
Shakeel Arrest: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పలు కేసుల్లో షకీల్‌పై అరెస్ట్ వారెంట్ ఉంది. చాలా రోజులుగా దుబాయ్ లో ఉంటున్న షకీల్ తల్లి మరణంతో ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ లో దిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ కు పోలీసులు అనుమతిచ్చారని, పోలీసుల సమక్షంలో ఆయన అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం. అంత్యక్రియలు పూర్తయ్యాక షకీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు తెలిసింది.