Vehicle New Rules: ఆ వాహనదారులకు బిగ్ అలర్ట్..వెంటనే ఈ పని చేయాలని ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2025-04-10 01:05 GMT
Vehicle New Rules: ఆ వాహనదారులకు బిగ్ అలర్ట్..వెంటనే ఈ పని చేయాలని ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం
  • whatsapp icon

Vehicle New Rules: మీరు పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా. అది 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారు అయ్యిందా. అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందే. ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల బండ్ల వరకు ఏవైనా సరే ఇకపై ఈ నెంబర్ ప్లేట్ ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రవాణాశాఖ సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేట్ కు కనిష్టంగా రూ. 320 గరిష్టంగా రూ. 800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రత లక్ష్యంగా..సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రవాణాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్ఎస్ఆర్ పీ నెంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలు అవుతోంది. ఇప్పుడు పాత వాహనాలకూ దీన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

* పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యాజమానిదే అని రవాణాశాఖ తెలిపింది. అది లేని వాహనాలను అమ్మాలన్నా...కొన్నాలన్నా రవాణా కార్యాలయంలో పేరు మార్చుకోవడం సాధ్యం అవదు.

*వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చేయరు. గడువు తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసు నమోదు చేస్తారు.

*వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర హెచ్ఎస్ఆర్ పీ బిగించే సదుపాయాన్ని కల్పించాలి. ఈ సమాచారం, నెంబర్ ప్లేట్ ధరలు డీలర్ల దగ్గర కనిపించే విధంగా ప్రదర్శించాలి. వాహనదారు ఇంటికే వెళ్లి నెంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా ఫీజు తీసుకుంటారు.

*వాహనదారులు ఈ ప్లేట్ కోసం www.siam.in వెబ్ సైట్లో వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫోటోను వెబ్ సైట్లో అప్ లోడ్ చేసుకోవాలి.

Tags:    

Similar News