Vijayashanti: ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు.. నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ..
Vijayashanti: సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

Vijayashanti: సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్‌ను మెయింటెన్ చేసి.. ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానని నమ్మబలికాడు చంద్రశేఖర్ రెడ్డి. దాంతో చంద్రశేఖర్ రెడ్డిని నమ్మి పెద్దమొత్తంలో విజయశాంతి దంపతులు డబ్బులు ఇచ్చారు.
ఆ తర్వాత సోషల్ మీడియా అకౌంట్‌ను మెయింటెన్ చేయకుండా వదిలేశాడు. దీనిపై నిలదీసినందుకు నరకం అంటే ఏమిటో చూపిస్తానంటూ విజయశాంతి దంపతులపై బెదిరింపులకు పాల్పడ్డాడు చంద్రశేఖర్. ఎస్ఎంఎస్, మెయిల్స్‌ను పంపించాడు. దీంతో విజయశాంతి అతనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.