MLC Kavitha: పవన్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురద్రుష్టం.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యాలు

Update: 2025-04-10 06:34 GMT
MLC Kavitha: పవన్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురద్రుష్టం.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యాలు
  • whatsapp icon

 MLC kavitha: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన సీరియస్ రాజకీయ నాయకుడు కాదు. ఆయన వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.

రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో పూర్తిగా వామపక్ష భావాజాలంతో ఉన్నట్లు అనిపించారు. చేగువేరాను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సీపీఐ, సీపీఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారింది. పూర్తీగా లెఫ్ట్ నుంచి రైట్ కు వచ్చారు. బీజేపీ పక్కన చేరిననాటి నుంచి హిందూత్వం మీద అతిభక్తి పెరిగిపోయింది. ఆయన చేసే ప్రకటనలను కూడా ఒకదానికొకటి సంబంధం ఉండవు.

తమిళనాడుకు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పార్టీ పెట్టిన 15సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అవ్వడం ఏపీ ప్రజల దురద్రుష్టమని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు పవన్ ఫ్యాన్స్ కవితపై విమర్శలు గుప్పిస్తుండగా..బీఆర్ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు.


Tags:    

Similar News