
liquor
liquor shops: మందుబాబులకు బిగ్ అలర్ట్. రేపు అనగా శనివారం మద్యం షాపులు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్టార్ హోటల్స్, రిజిస్టార్ క్లబ్స్ కు ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపులు ఉన్నట్లు వెల్లడించారు.