Wine Shops: మందుబాబులకు బిగ్ అలర్ట్.. రేపు వైన్ షాపులు బంద్..!
Wine Shops: హైదరాబాద్‌వ్యాప్తంగా రేపు వైన్ షాపులు బంద్ ఉంటాయి. 2025 ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బంద్ ఉంటాయని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.
Wine Shops: హైదరాబాద్‌వ్యాప్తంగా రేపు వైన్ షాపులు బంద్ ఉంటాయి. 2025 ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బంద్ ఉంటాయని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. శోభాయాత్రల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఏప్రిల్ 6న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
వైన్ షాపులతో పాటు కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. రెస్టారెంట్లలోని బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని రాచకొండ పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వైన్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని పోలీసులు కోరారు.