
Viral video: అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. గత నాలుగు రోజులుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసిన అలేఖ్య చిట్టి పికిల్స్ తిట్టిన బూతులు, ఆమె చేసిన బాగోతమే వైరల్ అవుతోంది. అదే సమయంలో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు నెటిజెన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అలేఖ్య చిట్టిపికిల్స్ కు వ్యతిరేకంగా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ ఇష్యూలో ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే అలేఖ్య ఐసీయూలో చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను అలేఖ్య సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రోలింగ్ తట్టుకోలేక అలేఖ్య ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారిందని అందుకే ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు ఆమె తెలిపారు. ఆక్సిజన్ తీసుకునే పరిస్థితిలో కూడా తన సోదరి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకనైనా తన కుటుంబం పై ట్రోలింగ్ ఆపాలంటూ వేడుకుంది. మూడు నెలల కిందటే తమ తండ్రి మరణించాడని..మా ఇంట్లో మరో చావు చూడకూడదని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ వీడియో అలేఖ్య ఐసీయూ బెడ్ పై ఉన్నట్లు స్పష్టం కనిపిస్తుంది.