TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేసాయ్..ఇలా చెక్ చేసుకోండి

Update: 2025-04-22 07:26 GMT
TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేసాయ్..ఇలా చెక్ చేసుకోండి
  • whatsapp icon

TS Inter Results: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ 2025 సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను ఏప్రిల్ 22, 2025న మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలో హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. అలాగే manabadi.co.in లో కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. దాదాపు 9.96లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు అయ్యారు.

కాగా 9 లక్షల 97 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది కంటే పాస్ పర్సంటేజ్ ఈ ఏడాది పెరిగింది. ఎప్పటి మాదిరిగానే ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పై చేయిగా నిలిచారు. ఇంటర్ ఫస్టియర్ లో 73 % శాతం అమ్మాయిలు పాస్ అవ్వగా..ఇంటర్ సెకండియర్ 77.73 % శాతం అమ్మాయిలు పాస్ అయ్యారు. ఇంటర్ సెకండియర్ లో మొత్తం 66.89 శాతం పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 71.37 శాతం పాస్ పర్సెంటేజ్ వచ్చింది.

రిజల్ట్స్ ను ఆన్ లైన్ లో చెక్ చేసుకునే విధానం:

ముందుగా అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలోకి వెళ్లాలి. అందులో “TS Inter Results 2025” లింక్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పరీక్ష సంవత్సరం, స్ట్రీమ్, హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి..“Get Memo” బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ రిజల్ట్స్ స్క్రీన్ పై కనిపిస్తాయి. దానిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News