
Nandini Gupta: మిస్ వరల్డ్ 2025 పోటీలకు అతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. మే 7 నుంచి నెలాఖరు వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు 140కిపైగా దేశాల నుంచి అందాల భామలు రానున్నారు. భారత్ నుంచి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 కిరీటం అందుకున్న నందిని గుప్తా పోటీల్లో పాల్గొనబోతున్నారు. రాజస్థాన్ లోని కోటకు చెందిన నందిని బుధవారం చార్మినార్ ను సందర్శించారు. లాడ్ బజార్ లోని గాజులు కొనుగోలు చేసి ఆమె మీడియాతో ముచ్చటించారు.
భారత్ తరపున పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సంప్రదాయ మూలాలతోపాటు ఆధునికత సంతరించుకున్న నగరం ఇది. ఐటీలో అభివ్రుద్ధి చెందుతోంది. సంస్క్రుతి వారసత్వం, సాంకేతికతను ప్రపంచం మారుతుంది. ఇక్కడి ఆతిథ్యం చాలా నచ్చింది. హోటల్ కు వచ్చినప్పుడు నానబెట్టిన బాదం పప్పులు ఇచ్చారు. ఒక తల్లి బిడ్డకోసం ఎలా చేస్తుందో అలాంటి అనుభూతి ఇక్కడ ఉంది. ఇక్కడి ఆహారం, భాష, సంస్క్రుతిలో వైవిధ్యం నన్ను కట్టిపడేశాయి. ప్రేమను పంచే నగరం ఇది. విదేశీ ప్రతినిధులకు మన దేశ సంప్రదాయాలు, సంస్క్రుతులు పరిచయం అవుతుందని తెలిపారు.