Wife kills husband: హైదరాబాద్‌లో భర్తను చంపి శవం మాయం చేసిన భార్య
Husband killed by wife: ఎప్పటిలాగే తాగివచ్చిన సాయిలును ముగ్గురూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు.

Wife kills husband: హైదరాబాద్‌లో భర్తను చంపి శవం మాయం చేసిన భార్య
Woman electrocuted husband to death: భార్యభర్తల మధ్య మనస్పర్దలు లేదా వివాహేతర సంబంధాలు ఒకరినొకరు కడతేర్చుకునే వరకు వెళ్తున్నాయి. కట్టుకున్న వారి కంటే పరాయి వ్యక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ జీవిత భాగస్వామిని భారంగా భావిస్తున్నారు. ఫలితంగా నూరేళ్లు కలిసి ఉంటామని ప్రమాణం చేసిన విషయాన్ని మర్చిపోయి వారి చేతులతోనే తమ లైఫ్ పార్ట్ నర్ ను మట్టుబెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
కూకట్‌పల్లికి చెందిన సాయిలు, కవిత ఇద్దరూ భార్యభర్తలు. ఇద్దరికీ పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చి వేరుగా ఉంటున్నారు. అయితే, సాయిలు అప్పుడప్పుడు మద్యం సేవించి కవిత ఇంటికి వెళ్లి వేధించసాగాడు. రాన్రానూ ఈ వేధింపులు ఎక్కువ అవడంతో కవిత తట్టుకోలేకపోయింది. ఇక ఎలాగైనా సరే సాయిలును వదిలించుకోవాలని భావించిన ఆమె తన చెల్లెలు, చెల్లెలి భర్త సాయంతో ఒక ప్లాన్ వేసింది.
ఎప్పటిలాగే తాగివచ్చిన సాయిలును ముగ్గురూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. ఆపై ఎవ్వరికీ అనుమానం రాకుండా సాయిలు మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తరువాత కవిత ఏమీ తెలియనట్లే తమ సొంతూరికి వెళ్లిపోయింది. సాయిలు ఎక్కడున్నాడని అడిగిన వారికి అబద్దం చెప్పింది. ఆయన పనికి వెళ్లి తిరిగిరాలేదు... ఎక్కడ తాగి తిరుగుతున్నాడో అని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె తీరుపై సాయిలు బంధువులకు అనుమానం వచ్చింది. సాయిలు అదృశ్యం వెనుక ఆమె హస్తం ఉండి ఉంటుందని అనుమానించారు. ఇదే విషయమై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిలు, సాయిలు భార్య మధ్య మనస్పర్ధలు, వాటి వెనుకున్న కారణాల గురించి కూడా పోలీసులకు తెలిపారు.
సాయిలు బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాయిలు భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట తనకేమీ తెలియదని బుకాయించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో అసలు నిజం ఒప్పుకుంది. రోజూ తాగొచ్చి హింసిస్తుండటంతో తనే సాయిలును హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించింది.