Dilsukhnagar blasts case: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు.. ఉరిశిక్షే సబబు

Dilsukhnagar blasts case, High Court's sensational verdict
Dilsukhnagar blasts case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీల్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పును వెలువరించింది. దీంతో కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఐదుగురు దోషులు అప్పీళ్లు దాఖలు చేశారు. కోర్టు నేడు తీర్పును వెలువరించింది.
2013 ఫిబ్రవరి 21న బస్టాపులో, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు.