Summer Holidays: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..వేసవి సెలవులపై సర్కార్ కీలక హెచ్చరిక

Holidays
Summer Holidays: తెలంగాణ ఇంటర్ బోర్డ్..విద్యార్థులకు శుభవార్త వినిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను అధికారికంగా ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30,2025 నుంచి ప్రారంభమై జూన్ 1,2025 వరకు కొనసాగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ కాలేజీలు ఈ షెడ్యూల్ ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. సెలవుల సమయంలో అధికారిక అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలంగాణ ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. విద్యార్థుల కోసం రూపొందించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవుల షెడ్యూల్ ఖరారు చేశారు.
మార్చి 30, 2025 నుంచి జూన్ 2, 2025 వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు, జూన్ 2,2025 నుంచి కొత్త విద్య సంవత్సరం ప్రారంభం అవుతుంది. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కాలేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొంది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కాలేజీల యాజమాన్యాలకు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. అక్రమంగా విద్యార్థులను బలవంతంగా తరగతులకు హాజరయ్యేలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.