400 ఎకరాల కంచ గచ్చిబౌలి స్థల వివాదంపై సుప్రీం కోర్టు తాత్కాలిక బ్రేక్స్.. హై కోర్టుకు, ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

Update: 2025-04-03 09:50 GMT

400 ఎకరాల కంచ గచ్చిబౌలి స్థల వివాదంపై సుప్రీం కోర్టు తాత్కాలిక బ్రేక్స్.. హై కోర్టుకు, ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

Supreme Court interim stay on deforestation on 400 Acres Kacha Gachabowli lands: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలం వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని ఆనుకుని ఉన్న ఈ భూములను వేలం వేయాలనే తెలంగాణ ప్రభుత్వంపై యూనివర్శిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లతో పాటు సామాజిక వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ భూముల్లో చెట్లు కొట్టేస్తుండటంపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ భూముల వివాదంపై పూర్తి నివేదిక అందించాల్సిందిగా తెలంగాణ హై కోర్టును ఆదేశించింది.

గురువారం మధ్యాహ్నం 3.30 గంటల్లోపు ఘటన స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టు తెలంగాణ హై కోర్టు జుడిషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీచేసింది. 3.45 గంటలకు ఈ పిటిషన్ పై మరోసారి విచారణ చేయనున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. జస్టిస్ బి.ఆర్.గవాయి, ఏ.జి. మసిలతో కూడిన ధర్మాసనం ఈ తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీచేసింది.

తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతంలో చెట్లు కొట్టడానికి వీల్లేదని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. 8 రకాల జీవరాశులకు కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతం ఆవాసంగా ఉందని కోర్టు దృష్టికి వచ్చిందనే విషయాన్ని కూడా ధర్మాసనం ఈ ఆదేశాల్లో పేర్కొంది. 

Tags:    

Similar News