తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడే ప్రజల కోసం ఒక ఛాలెంజ్ తో ఏర్పడిందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ కి బలమైన కార్యవర్గం వుందని, పార్టీలో ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి అందరం కలిసి కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
గత ఎన్నికలు 2019 జరగాల్సినవని కానీ ఆరు నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహించారన్నారు. గత ఎన్నికల్లో మహాకూటమిగా వెళ్ళి పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరగడం వల్ల భంగపడ్డామన్నారు. జిహెచ్ఎంసీ, పట్టభద్ర ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులు ఎన్నికల కోసం ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టామన్నారు. ఊహించని విధంగా దుబ్బాక ఎమ్మెల్యే మరణించడం వల్ల ఉప ఎన్నికలు వచ్చాయని, ఇతర ఎన్నికల పైన దృష్టి పెట్టడం కోసమే దుబ్బాకలో పోటీ చేయలేదని ఆయన స్పష్టం చేసారు. కరోనా వైరస్ తో పాటు ప్రజా సమస్యల పైన దృష్టి సారించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచే నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లక్షల ఎకరాల పంట దెబ్బతిని రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయని, ఎన్నో ఇళ్లు కూలిపోయాయన్నారు. గత ఎన్నికల్లో 30 వేల కోట్లు హైదరాబాద్ కు ఖర్చు చేస్తామని నాయకులు హామీ ఇచ్చారని, అందులో భాగంగానే డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ చేయాలి, చెరువుల మరమ్మతులు చేపట్టాలి , కాలువల పునరుద్ధరణ చేయాలని కోరారు. అసెంబ్లీ నియోజకవర్గం పైన మా ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు దృష్టి పెట్టారని స్పష్టం చేసారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొన్నారని, రేపు జరిగే దీక్షలో ఎమ్మెల్యేలు తో పాటు నేను కూడా పాల్గొంటున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ కేడర్ అభివృద్ధికి కృషి చేసి నాయకత్వాన్ని పటిష్ట పరుస్తామని పేర్కొన్నారు.