Hyderabad: డెక్కన్ మాల్‌లో ఇంకా దొరకని మృతదేహాలు
Hyderabad: బిల్డింగ్ కూల్చివేతకు అనుమతి ఉన్నప్పటికీ.. మృతదేహాలు దొరకని కారణంగా సందిగ్ధం
Hyderabad: రామ్‌గోపాల్‌పేట్ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన ముగ్గురు వ్యక్తుల్లో ఇంకా ఇద్దరి మృతదేహాలు లభ్యం కాలేదు. మరోవైపు బిల్డింగ్ స్లాబులు వరుసగా కుప్పకూలుతున్నాయి. బిల్డింగ్ కూల్చివేతకు అనుమతి ఉన్నప్పటికీ మృత దేహాలు దొరకని కారణంగా అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. నిన్న ఫైర్ సిబ్బంది చివరి ప్రయత్నం చేశారు. అయినా కూడా మృతదేహాల ఆనవాలు సైతం కనిపించలేదు.