Rythu Bandhu: 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సొమ్ము

ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ చేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

Update: 2021-06-13 13:00 GMT

రైతుబంధు (ఫొటో ట్విట్టర్)

Rythu Bandhu: ఈ నెల 15 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నారు.

రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63,25,695 మంది అర్హులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు అర్హుల తుది జాబితాను సీసీఎల్‌ఏ వ్యవసాయ శాఖకు అందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150.18 లక్షల ఎకరాలకు గాను రూ.7,508.78 కోట్లు అవసరం కానున్నాయని పేర్కొన్నారు. ఈసారి కొత్తగా 66,311 ఎకరాలు రైతు బంధు పథకంలో చేరాయని తెలిపారు. అందుకు అనుగుణంగా 2.81 లక్షల మందికి రైతుబంధు నిధులు అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు.

Tags:    

Similar News