Revanth Reddy: ఇక్కడి బడి, గుడి నేను కట్టినవే
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిగ్రీ కాలేజీ తెస్తా
Revanth Reddy: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందాయని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్‌లో, దౌల్తాబాద్‌లో ఏర్పాటు చేసిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మద్దూర్ చీమల దండుగా కదిలిందని, మద్దూర్‌లో 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కాలేజ్ భవనం, పాఠశాల నిర్మించింది నా హయాంలోనేనని. బీఆర్ఎస్ నాయకులు తమ ఊర్లని చెప్పుకునే గ్రామాలకు రోడ్లు వేయించింది మనమేనన్నారు. మిమ్మల్ని నేను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటే.. మీరు నన్ను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు.
350 కోట్ల రూపాయలతో గ్రామ గ్రామాన తాగు నీరు సౌకర్యం తెచ్చింది తానని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు రాలేదని,, రైల్వే లైన్ రాలేదని, డిగ్రీ కాలేజీ రాలేదనన్నారు. ఏమీ చేయని.. ఏమీ తేలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి... ఇందిరమ్మ రాజ్యం తెచ్ఛుకుందామని రేవంత్ పిలుపునిచ్చారు.