ఈ నెల 15వ తేదీన నిర్మల్‌లో రేవంత్ రెడ్డి బహిరంగ సభ
Revanth Reddy: సభను విజయవంతం చేయాలన్న కూచాడి శ్రీహరి రావు
Revanth Reddy: శాసన సభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన నిర్మల్‌కు రానున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయ వంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వెళ్లే దారిలో దాదాపు 70వేల మందితో భారీ బహరంగసభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు కార్యకర్తలు, కర్షకులు, నిరుద్యోగులు,అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గలమెత్తేందుకు రేవంత్‌రెడ్డి నిర్మల్‌కు వస్తున్నారన్నారు.