Revanth Reddy: కేసీఆర్, మోడీ బంధం బయటపడింది
Revanth Reddy: వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు రాముడు అయ్యారు.. కాంగ్రెస్‌లో చేరగానే రావణుడు అయ్యారా?
Revanth Reddy: కేసీఆర్, మోడీ బంధం బయటపడిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. గోయల్ ఇంట్లో 300 కోట్లు ఉన్నాయని చెప్పాం.. అవి పట్టుకోకుండా వివేక్, పొంగులేటి ఇళ్లపైనా దాడులా అంటూ ప్రశ్నించారు. ముందుగానే రైతుబంధు వేయాలని ఈసీని కోరామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జనవరిలో 15 వేలు ఇస్తామన్నారు. బీఆర్‌ఎస్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న రేవంత్.. వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు రాముడు అయ్యారు.. కాంగ్రెస్‌లో చేరగానే రావణుడు అయ్యారా అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి.