Vari Deeksha: ఒకే వేదికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి

Vari Deeksha: ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష

Update: 2021-11-27 08:55 GMT
Revanth Reddy And Komatireddy Venkat Reddy Attended to the Vari Deeksha at Indira Park

వారి దీక్ష కు హాజరైన రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి  

  • whatsapp icon

Vari Deeksha: ఒకే వేదికపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కనిపించారు. ఇద్దరు నేతలు ఒకే వేదికపై కన్పించడం విశేషం. ఇందిరాపార్క్ వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ రెండు రోజుల పాటు దీక్ష చేస్తుంది. ఈ దీక్షకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఇద్దరు ఆలింగనం చేసుకుని ఒకే వేదికపై పక్క పక్కనే కూర్చున్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ లోకి అడుగుపెట్టలేదు. ఆయనపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల దారుణ ఓటమిపై కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం, ఇద్దరూ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News