Raghunandan Rao: ఓఆర్ఆర్ లీజ్ వ్యవహరంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

Raghunandan Rao: ఓఆర్ఆర్ అక్రమ టెండర్లపై ప్రభుత్వం స్పందించాలి

Update: 2023-05-25 12:31 GMT

Raghunandan Rao: ఓఆర్ఆర్ లీజ్ వ్యవహరంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

Raghunandan Rao: ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై పలు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. టెండర్లపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. లక్ష కోట్ల ఆదాయం వచ్చే టెండర్ పై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. ORR టోల్ గేట్ పై సమీక్ష చేయడానికి సీఎం కేసీఆర్ కు టైం లేదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

ORR టెండర్ల విషయంలో HMDA అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. IRB సంస్థకు ఎందుకు వెసులుబాటు ఇస్తున్నారని.. టెండర్లు విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే CBI దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని రఘునందన్ రావు చెప్పారు.

Tags:    

Similar News