Rahul Gandhi: రాహుల్ రాకను నిరసిస్తూ వెలసిన పోస్టర్లు
Rahul Gandhi: కర్ణాటకలో ఉద్యోగాలు కాదు ఉరితాళ్లే అంటూ పోస్టర్లు
Rahul Gandhi: నిజామాబాద్, బోధన్‌లో పోస్టర్లు కలకలం సృష్టించాయి. రాహుల్ రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే గోడలపై పోస్టర్లు ప్రత్యక్షం కాగా.. వాటిల్లో రాహుల్, రేవంత్‌రెడ్డి ఫొటోలు ఉన్నాయి. తెలంగాణలో బలిదానాల బాధ్యత కాంగ్రెస్‌దేనని, తమ బిడ్డలను చంపింది కాంగ్రెస్ అంటూ పోస్టర్లలో ఉంది. ఇందుకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని పోస్టర్లలో డిమాండ్ చేశారు. అలాగే.. ఈ పోస్టర్లలో కర్ణాటకలో కరెంట్ కష్టాలు, నిరుద్యోగాన్ని కూడా ఎండగట్టారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి కరెంట్ లేకుండా అల్లాడుతున్న కర్ణాటక అంటూ విమర్శించారు. కన్నింగ్ కాంగ్రెస్ మనకు అవసరమా అని ప్రశ్నలు సంధించారు. కర్ణాటకలో ఉద్యోగాలు కాదు.. ఉరితాళ్లేనంటూ పోస్టర్లు అంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. బోధన్‌లో ఇవాళ రాహుల్ పర్యటన నేపథ్యంలో.. ఇలాంటి పోస్టర్లు ప్రత్యక్షమవడం.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.