Bodhan: బోధన్‌లో ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్
Bodhan: వివాదం రాజేసిన ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రోటోకాల్ ఘటన
Bodhan: బోధన్‌లో ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మారింది వ్యవహారం. బోధన్‌లో ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రోటోకాల్ ఘటన వివాదం రాజేసింది. ఎమ్మెల్యే షకీల్, ఛైర్‌పర్సన్ తూము పద్మ మధ్య గతం కొంతకాలంగా విభేదాలున్నాయి. తూము పద్మ ప్రోటోకాల్ పాటించడంలేదని.. ఎమ్మెల్యే షకీల్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోధన్‌లో నేతల వివాదంపై బీఆర్ఎస్ హైకమాండ్ ఆరా తీసింది. ఇరువురి నేతల వ్యవహారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి వద్దకు చేరింది.