Nalgonda: అంబులెన్స్ ను ఎత్తుకెళ్లిన దొంగ.. లారీలు అడ్డుపెట్టి పట్టుకున్న పోలీసులు
108 Ambulance: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ దొంగ హల్‌చల్ చేశాడు.
108 Ambulance: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ దొంగ హల్‌చల్ చేశాడు. హయత్‌నగర్‌లో 108 అంబులెన్స్‌ను చోరీ చేసి ఖమ్మం వైపు వెళ్తుండగా టేకుమట్ల స్టేజీ వద్ద పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నకిరేకల్ పీఎస్ వరకు పోలీసులకు చిక్కకుండా దొంగ తప్పించుకున్నాడు. చిట్యాల వద్ద అంబులెన్స్‌ను ఆపేందుకు ఎస్ఐ జాన్ రెడ్డి యత్నించగా కొర్లపహాడ్ టోల్‌గేట్‌ను ఢీకొట్టి దొంగ పారిపోయాడు.
ఎట్టకేలకు టేకుమట్ల స్టేజీ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్‌తో పారిపోతున్న దొంగను కేతేపల్లి ఎస్ఐ శివతేజ పట్టుకున్నాడు. గతంలోనూ ఓ సారి అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే నిందితుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా నటిస్తున్నట్లు సమాచారం.