Kishan Reddy: దశాబ్దాల సమస్యను మోడీ పరిష్కరిస్తామన్నారు
Kishan Reddy: మాదిగల సమస్యను ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారని, ఎస్సీ వర్గీకరణను బీజేపీ భుజాన వేసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
Kishan Reddy: మాదిగల సమస్యను ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారని, ఎస్సీ వర్గీకరణను బీజేపీ భుజాన వేసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సమస్య పరిష్కారమయ్యే విధంగా కేంద్రం కృషి చేస్తుందని, కేంద్రం వేసే కమిటీ వర్గీకరణ చేయాలా.. వద్దా.. అని కాదని, వేగవంతంగా అమలు చేయడం కోసమే ఒక టాస్క్ ఫోర్క్ కమిటీని కేంద్రం నియమించిదన్నారాయన... కానీ కొన్ని పార్టీలు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ ప్రధానీ చొరవ చూపలేదని, మాదిగల సమస్యకు మొదటి దోషి కాంగ్రెస్ పార్టీనే అన్నారు కిషన్ రెడ్డి... ఉష మెహ్రా కమిటీ రిపోర్టును కాంగ్రెస్ పార్టీ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందన్నారు.
న్యాయస్థానం తీర్పు అనుకూలంగా రాకపోతే.. చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని, భయపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కసారి కూడా ప్రధానిని ఈ విషయంలో కలవలేదన్నారు. తమ కింద భూమి కదులుతుందని ఈ రెండు పార్టీలూ భయపడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి... ఇది ఓట్ల కోసమో, రాజకీయాల కోసం కాదని, ఓట్లు కోసమే అయితే మహిళా చట్టాన్ని కూడా ఇపుడే అమలు చేసే వాళ్లమని కిషన్ రెడ్డి అన్నారు.