MLC Kavitha: అమిత్‌షా అబద్ధాలకు బాద్‌షా
MLC Kavitha: బీజేపీ గెలిస్తే చక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామంటున్నారు.. కానీ ప్రభుత్వ సంస్థలను బీజేపీ ప్రైవేట్ పరం చేసింది
MLC Kavitha: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అమిత్‌షా అబద్ధాలకు బాద్‌షా అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అమిత్‌షా మోసపూరితమైన హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ గెలిస్తే చక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామంటున్నారు.. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసిందని కవిత అన్నారు. ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత రోడ్‌షోలో పాల్గొన్నారు.