Malla Reddy: ప్రజాసేవే నా జీవితం.. ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం
Malla Reddy: మల్లారెడ్డి పేరు చరిత్రలో ఉండాలనేది నా కోరిక
Malla Reddy: ప్రజా సేవే తన జీవితమని, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని అన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి మల్లారెడ్డిని వక్ఫ్ బోర్డు బాధిత కుటుంబాలు ఘనంగా సన్మానించాయి. మల్లారెడ్డి చొరవతో తమ సమస్యల పరిష్కారానికి అడుగులు పడినందుకు గాను.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు బాధిత కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తన లాస్ట్ ఎలక్షన్ అని, తెలంగాణలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా మల్లారెడ్డి పేరు చరిత్రలో ఉండాలనేది తన కోరిక అని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రజలు ఓట్లేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మల్లారెడ్డి.