Minister KTR: నేడు మంత్రి కేటీఆర్‌ షెడ్యూల్‌ బిజీబీజీ

Minister KTR: ఉదయం 10 గంటలకు టీఎస్‌ బిల్డర్స్‌ ఫెడరేషన్‌తో భేటీ

Update: 2023-11-14 01:43 GMT

Minister KTR: నేడు మంత్రి కేటీఆర్‌ షెడ్యూల్‌ బిజీబీజీ

Minister KTR: ఇవాళ పలు కార్యక్రమాలతో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడపనున్నారు. తాజ్ డెక్కన్‌లో ఉదయం 10 గంటలకు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్‌తో ఆయన సమావేశమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు చిట్యాలలో రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడ నకరికల్లు బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటలకు నాగోల్ దేవకీ కన్వెన్షన్‌లో హాండ్లూం టెక్స్ టైల్స్ నేత కార్మికులతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో కార్మిక విభాగంతో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు డిక్కీ డెలిగేట్‌లతో నిర్వహించే మీటింగ్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

Tags:    

Similar News