Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈనెల 21 నుంచి ప్రారంభం

Medaram Jatara: భక్తుల కోసం 6 వేల బస్సులను సిద్ధం చేస్తున్న ఆర్టీసీ

Update: 2024-02-10 13:47 GMT

Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈనెల 21 నుంచి ప్రారంభం

Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా... భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం 6 వేల బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. వీటికి సంబంధించిన పనులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు.

మేడారం జాతరకి పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు మేడారానికి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటికి సంబంధించి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. తాడ్వాయి, కామారంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. తాడ్వాయిలోని టికెట్ ఇష్యుయింగ్ కౌంటర్లు, కామారంలో బస్సుల కోసం 3 పార్కింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేశారు. మేడారంలో 55 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

ఈ నెల 16న మేడారంలో టీఎస్ ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను ప్రారంభించనున్నారు. మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వారికి భోజన, వసతి విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. జాతరకు 30 లక్షల మంది భక్తులు వస్తారని టీఎస్ ఆర్టీసీ అంచనా వేస్తోంది. మరోవైపు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం ఉండటంతో బస్సులు చాలా రద్దీగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున మేడారానికి భక్తులు వస్తుండటంతో వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ సమాయత్తం అవుతోంది.

Tags:    

Similar News