Maoist: మావోయిస్ట్ ప్రాంతాల్లోనే భారీగా పోలింగ్
Maoist: జగిత్యాల, అసీఫాబాద్ జిల్లాలో పోలింగ్ జోరు
Maoist: తెలంగాణ అంతటా పోలింగ్ సందడి కొనసాగుతోంది. ఓటర్లు క్రమంగా పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా.. పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. కానీ.. అందుకు విరుద్ధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ మాత్రం ఇతర ప్రాంతాల కంటే అధికంగా నమోదవుతోంది. 1 గంట సమయానికి అదిలాబాద్ జిల్లాలో 41.88 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జల్లాలో 39.29 శాతం, జగిత్యాలలో 46.14శాతం, అసీఫాబాద్‌లో 42.77, ములుగు జిల్లాలో 45.69, మహబూబాబాద్‌లో 46.89 శాతం పోలింగ్ నమోదయ్యింది.
ఇదే కాకుండా.. ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలింగ్ అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదట్టం చేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.
ప్రత్యేకించి ములుగు జిల్లాలో భారీగా భదరతా బలగాలను మోహరించారు. ఏటూరునాగారం డివిజన్ పరిధిలోని మారుమూల గ్రామాల్లో సీఆర్‌పీఎఫ్, గ్రేహండ్స్ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ములుగు జిల్లాలో మావోయిస్ట్ సమస్యాత్మక ప్రాంతాలైన కొండాయి, మల్యాల, తుపాకులగూడెం, దేవాదుల, కన్నాయిగూడెం, కాల్వపల్లి, వాజేడు, వెంకటాపురం, పేరూరు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడంతో.. ఏటూరు నాగారం డివిజన్‌పై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రజలు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు,.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖమ్మం జిల్లాలో 42.93.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39.14 శాతం పోలింగ్ నమోదైంది. భద్రాచలం నియోజకవర్గంలో 47 శాతం పోలింగ్ నమోదవగా.. అశ్వారావుపేటలో 44, కొత్తగూడెం 33.5, పినపాకలో 37, ఇల్లందు 39, వైరా 46.7, సత్తుపల్లి 44.86, పాలేరులో 44.98.. మధిరలో 40.67.. ఖమ్మం నియోజకవర్గంలో 39.23 శాతం పోలింగ్ నమోదైంది.
ఆదిలాబాద్ 40.20.. బోథ్ 43.83..ఆసిఫాబాద్ 45.5.... సిర్పూర్ 40..బెల్లంపల్లి 46.. చెన్నూరు 43.5... మంచిర్యాల 40.1.. ఖానాపూర్