Malla Reddy: గిదేంది మల్లన్న.. ఇంతకీ మల్లన్న చదివింది ఏ కాలేజీలో?
Malla Reddy: 2023లో రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
Malla Reddy: మైకు పట్టుకున్నారంటే చాలు డైలాగులతో అల్లాడిస్తుంటారు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాను నడిచొచ్చిన ప్రయాణాన్ని తనదైన మాటల్లో చెప్తూ.. అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇదంతా ఎవరో హీరో గురించి కాదు.. మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురించి.
ఎప్పుడూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసే మల్లారెడ్డి తరుచుగా వివాదాల్లో కూడా ఇరుక్కుంటారు. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు మల్లారెడ్డి. ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటి వరకూ మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు మల్లారెడ్డి. అయితే ఎన్నికల అఫిడవిట్ లో తన విద్యార్హతకు సంబంధించి ఎక్కడ చదువుకున్నాననే దానిపై మూడు స్లార్లు భిన్నమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.. ఇది చూసిన వారంతా గిదేంది మల్లన్నా అంటూ ప్రశ్నస్తున్నారు.
2014లో మల్కజిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు మల్లారెడ్డి. అయితే అప్పుడు ఇచ్చిన అఫిడవిట్ లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు. అంత వరకూ బాగానే ఉంది
2016లో బీఆర్ఎస్ లో చేరిన మల్లారెడ్డి 2018లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. తరువాత మంత్రి కూడా అయ్యారు. అయితే 2018 లో ఇచ్చిన అఫిడవిట్ లో సికింద్రాబాద్ లో ని వెస్లి జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్లుడైనట్టు పేర్కొన్నారు. 2014లో ఇచ్చిన దానికి దీనికి ఏమాత్రం పొంతనలేదు. 2014లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు చెబితే, 2018 లో ఇచ్చిన అఫిడవిట్ లో సికింద్రాబాద్ లో ని వెస్లి జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు తెలిపారు.
2023 వచ్చే సరికి మరీ విచిత్రంగా ఉంది. 2014లో ఇచ్చిన దానికి, 2018 లో ఇచ్చిన ఏమాత్రం పొంతన కుదరడంలేదు. 2023లో ఇచ్చిన అఫడవిట్ లో రాఘవ లక్ష్మిదేవి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు పేర్కొన్నారు.2014లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు చెబితే, 2018 లో ఇచ్చిన అఫిడవిట్ లో సికింద్రాబాద్ లో ని వెస్లి జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు ఇచ్చారు. ఇప్పడు రాఘవ లక్ష్మిదేవి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు అఫిడవిట్ లో ఇచ్చారు.
అసలు ఏం జరిగింది ? ఎందుకు ఈ గందరగోళం ? అనేది ఎవరికీ అర్థం కావడంలేదు. ఇది తెలిసిన వారు మాత్రం గిదేంది మల్లన్నా అంటూ ప్రశ్నిస్తున్నారు.