రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం
TS Weather: దీని ప్రభావంతో రేపటికల్లా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది
TS Weather: బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపటికల్లా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 22 నాటికి వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే సూచనలు ఉన్నాయి. వాయుగుండం పయనించే దిశను బట్టి అయా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. వాయుగుండం పయనించే దశపై ఇంకా స్పష్టత రాలేదు. ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.