Warangal: వరంగల్‌లో భారీగా కురుస్తున్న వర్షాలు.. వాగులో నిలిచిపోయిన ఓ లారీ

Warangal: వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్‌

Update: 2023-07-25 09:20 GMT

Warangal: వరంగల్‌లో భారీగా కురుస్తున్న వర్షాలు.. వాగులో నిలిచిపోయిన ఓ లారీ

Warangal: వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై పంథిని శివారులో వాగు పొంగడంతో వరదనీరు రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అటు ఖమ్మం, తొర్రూరు నుంచి వరంగల్ వైపు వచ్చే వాహనాలు ప్రవాహానికి ఇరువైపులా పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. 

Tags:    

Similar News