హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం
Hyderabad: కోఠీలో కొట్టకుపోయిన మోటారు సైకిల్
Hyderabad: హైదరాబాద్‌లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పాతబస్తీ, కోఠి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కోఠీ ప్రాంతంలో ఓ మోటారు సైకిల్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మలక్ పేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరదనీరు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి.
లక్డీకపూర్, ఖైరతాబాద్, నాంపల్లి, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ కాలనీ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట ప్రాంత పరిసరాల్లోనూ భారీ వర‌్షంకురింది. హిమాయత్ నగర్, నారాయణగూడ పరిసరాల్లో ప్రధాన రహదారులపై మోకాలులోతు నీరు నిలిచిపోయింది. ఊహించని విధంగా కురిసిన వర్షంతో అర్థరాత్రి ఇళ్లకు వెళ‌్తున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షంతో ప్రధాన రహదారులు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.