KTR-Harish Rao: కృష్ణార్జునుల జోరు.. చివరి దశకు చేరిన ఎన్నికల ప్రచారాలు
KTR-Harish Rao: సాయంత్రం మలక్‌పేట, గోషామహల్‌లో రోడ్ షోలు
KTR-Harish Rao: ప్రచారాల పర్వం చివరి దశకు చేరింది. ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో.. బీఆర్ఎస్ అగ్ర నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, భువనగిరి జిల్లాలో మంత్రి హరీష్ రావు ప్రచారాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ జిల్లా నుంచి మొదలు... నర్సంపేట, పాలకుర్తి, చేర్యాలలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆలేరు, భువనగిరిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మరోవైపు మంత్రి కేటీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. బికనూర్, కామారెడ్డి, నిజామాబాద్ టౌన్లలలో కేటీఆర్ రోడ్ షోలు చేయనున్నారు. సాయంత్రం మలక్‌పేట, గోషామహల్ లో రోడ్ షోలు చేయనున్నారు. ఇప్పటివరకూ చేసిన అభివృద్ది కొనసాగాలంటే.. రాబోయే రోజుల్లో తెలంగాణ సుస్థిరంగా మారాలంటే.. బీఆర్ఎస్‌కే ఓటెయ్యాలని మంత్రి కేటీఆర్ ఓటర్లను కోరుతున్నారు.