Konda Surekha: నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా...

Konda Surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సినీ ఇండస్ట్రీ గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపానికి గురైతే వాటిని బేషరుతగా వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Update: 2024-10-03 01:58 GMT

Konda Surekha: నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా..ఎవరైనా మనస్తాపానికి గురైతే అన్యతా భావించవద్దు

Konda Surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సినీ ఇండస్ట్రీ గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపానికి గురైతే వాటిని బేషరుతగా వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బుతీయడం కాదంటూ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడిగా చిన్న చూపు ధోరణని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభాలను దెబ్బతీయాలని కాదు అంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు.

స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం కాదు..అదర్శం. నా వ్యాఖ్యలపట్ల మీరు కానీ...మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే నా వ్యాఖ్యలను పూర్తి ఉపసంహరించుకుంటున్నాను..మీరు అన్యద భావించవద్దు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కొండాసురేఖ.

ఇక నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ.



కాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంత్రిని సన్మానిస్తున్న సమయంలో తీసిన ఫొటోలతో అసభ్య ప్రచారం చేయడంపై స్పందించే క్రమంలో కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మూడు సోషల్ మీడియా అకౌంట్లు దుబాయ్ నుంచి ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని అన్నారు. తనపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కనీసం ఖండించడం పోయి..ఇష్టానుసారంగా కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ పోస్టులు పెట్టిన వారిని పార్టీ నుంచి బహిష్కరించుకుండా..వెనకవేసేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. పోస్టుల వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోస్టులకు కంప్లెయింట్ చేసినట్లు చెప్పారు.

కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించి నానా ఇబ్బందులు పెట్టాడు. నాగాచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణం. చాలా మంది హీరోయిన్లు సినిమా పరిశ్రమ నుంచి బయటకు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే కారణం. ఈ విషయం అందరికీ తెలుసు అంటూ కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. మహిళనైనా తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన హరీశ్ రావు ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ కేటీఆర్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. గతంలో మేయర్ విజయలక్ష్మీ, మంత్రి సీతక్కపై కూడా ఇలాంటి పోస్టులు పెట్టారంటూ గుర్తుచేశారు. ఈ పోస్టుల వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కొండా సురేఖ.

అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ భగ్గమంటోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సినీ ప్రముఖులు ఎన్టీఆర్, నాని, నాగార్జున, అమలతోపాటు పలువురు ఫైర్ అయ్యారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను వాడుకోకండి..గౌరవించండి..బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళ ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

 


Tags:    

Similar News