ప్రాణం తీసిన గాలిపటం.. మాంజా ధారం చుట్టుకుని..

Mancherial: పతంగి మాంజా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి మాంజా ధారం చుట్టుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

Update: 2022-01-15 14:52 GMT

ప్రాణం తీసిన గాలిపటం.. మాంజా ధారం చుట్టుకుని..

Mancherial: పతంగి మాంజా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి మాంజా ధారం చుట్టుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రక్తం మడుగు కట్టి రోడ్డంతా వ్యాపించింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి మాంజా ధారం కనిపించకపోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. మాంజా ధారం గొంతుకు చుట్టుకుని అక్కడికక్కడే చనిపోయాడు. టీవీఎస్ చాంప్ పై భార్యతో కలిసి వెళ్తున్న సమయంలో భర్త ప్రమాదానికి గురై క్షణాల్లో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన చూసిన భార్య తీవ్ర షాక్ కు గురైంది. మంచిర్యాల జాతీయ రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తుండగా మాంజా ప్రమాద ఘటన జరిగింది.

సరదాగా ఎగిరేసే గాలిపటాలు ప్రాణాలు తీస్తున్నాయి. గాలి పటాలతో పక్షులతో పాటు మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగిరేసే గాలి పటాలు ప్రమాదకరంగా మారాయి. భీమయ్య అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా మాంజా ధారం చుట్టుకుని చనిపోయిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. టీవీఎస్ చాంప్ బైక్ పై భార్య భర్తలు వెళ్తున్నారు. ఆకస్మాత్తుగా ఓ గాలిపటం తెగి రోడ్డుపైకి వచ్చింది. ఆ గాలిపటం మాంజా ధారం బైక్ పై వెళ్తున్న ఆ వ్యక్తికి చుట్టుకుంది. దీంతో గొంతు తెగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి చనిపోయిన ప్రదేశం రక్తమడుగు అయింది.

ఈ మాంజా ధారం తెగిపోకుండా ఉండేందుకు తయారీదారులు ప్రత్యేకమైన పదార్థాలతో తయారు చేస్తారు. సీసం వంటి ప్రమాదకరమైన పదార్థాలు మాంజాధారం తయారీలో ఉపయోగిస్తున్నారు. పండుగ సమయంలో పతంగిలు ఎగిరేసే వారు మిగతా వారి పతంగి ధారాలు తెగ్గొసేందుకు పదునుగా ఉండే మాంజాధారాలు వాడుతుండటంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చైనా మాంజాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ప్లాస్టిక్, సీసం పదార్థాలు కలిపి మాంజా ధారాలు పదునుగా తయారు చేస్తుండటంతో అవి తగిలి పక్షుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా మంచిర్యాలలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మాంజాధారం తగిలి ప్రాణాలు కోల్పోవడం పండుగ పూట విషాదాన్ని నింపింది. రోడ్డుపై వ్యక్తి పడి ఉన్న దృశ్యాలు కలిచి వేశాయి.

Tags:    

Similar News