Kasireddy Narayanareddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల అమలు

Kasireddy Narayanareddy: కేసీఆర్ పాలనలో నిరుపేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు

Update: 2023-11-25 02:38 GMT

Kasireddy Narayanareddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల అమలు

Kasireddy Narayanareddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్, తర్నికల్ తండా గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేసీఆర్ పాలనలో నిరుపేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ అభివృద్ధి పేరిట దక్షిణ తెలంగాణకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన సొంత గ్రామంలో ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని.. మరి కల్వకుర్తి నియోజకవర్గంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు నారాయణరెడ్డి.

Tags:    

Similar News