KA Paul: నరేంద్ర మోడీ బీసీ కాదు.. నా శిష్యుడు

KA Paul: నవంబర్‌ 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోండి

Update: 2023-11-13 10:47 GMT

KA Paul: నరేంద్ర మోడీ బీసీ కాదు.. నా శిష్యుడు

KA Paul: బీజేపీకి మందకృష్ణ మాదిగ మద్దతు తెలపటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు.మందకృష్ణను తన పార్టీలో చేరమని అడిగితే 25 కోట్లు డిమాండ్ చేశారని కేఏ పాల్ ఆరోపించారు. పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి మందకృష్ణకు బీజేపీ నుంచి 72 కోట్లు ముట్టినట్టుగా ఆరోపణలు చేశారు.

ప్రధాని మోడీకి మందకృష్ణ అమ్ముడుపోయారన్నారు. గతంలో మోదీని ఇష్టం వచ్చినట్లు తిట్టిన మందకృష్ణ.. ఇప్పుడు అదే నోటితో దేవుడు అంటున్నారని విమర్శించారు. మోడీ బీసీ కాదని.. తన శిష్యుడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.నవంబర్ 30 వ తేదీన జరిగే పోలింగ్‌లో ఆ మూడు పార్టీలకు ఓట్లు వేయొద్దని.. ఇంట్లోనే కూర్చోవాలని కేఏ పాల్ సూచించారు. ప్రజాశాంతి పార్టీకి గుర్తు కేటాయించనందుకు..రేపు తెలంగాణ హైకోర్టు‌ను ఆశ్రయించనున్నట్లు కేఏ పాల్ తెలిపారు.

Tags:    

Similar News