Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా జితేంద్ర
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేంద్ర ను నియమించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ ను డీజీపీగా నియమించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.
Telangana DGP:తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ దీనికి సంబంధించిన ఉత్వర్వులు జారీ కానున్నాయి. మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సినప్పటికీ సీఎం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది.
ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం జితేందర్ డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా రవిగుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.