ఘనంగా రాబందుల అంతర్జాతీయ అవగాహన దినోత్సవం
Hyderabad: రాబందు జాతులపై తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ పోస్టర్ రిలీజ్
Hyderabad: రాబందులు మనకు బంధువులేనని, పర్యావరణహితం కోసం వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ పిలుపునిచ్చింది. రాబందుల అంతర్జాతీయ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని 9 రాబందు జాతులపై రూపొందించిన పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ హైదరాబాద్ చాప్టర్ విడుదల చేశాయి. మూఢనమ్మకాలతో వేటాడటం, వాటి ఆవాసాలను నాశనం చేయడం వల్ల రాబందుల సంఖ్య దేశంలో మరింత ప్రమాదకర స్థాయికి తగ్గుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రాబందుల సంఖ్య పెరగాలంటే వాటిపై సరైన అవగాహన కల్పించడం అవసరమని తెలిపారు. రాబందులు మన వాతావరణంలో కుళ్లిన జంతు కళేబరాలను తింటూ పరోక్షంగా పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. రాబందుల సంఖ్య తగ్గడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని పేర్కొన్నారు.