గల్ఫ్ లో ఉద్యోగాలంటు ఘరానా మోసం

* నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన వంచన * 48 మంది నుంచి రూ.32 లక‌్షలు వసూలు * 18 నెలలుగా గల్ఫ్ కు పంపకుండా ముప్పు తిప్పలు

Update: 2021-01-25 10:45 GMT

Representational image

నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. గల్ఫ్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర వేసి 48 మంది నుంచి 32 లక్షలు వసూలు చేసి చేతులు ఎత్తేసాడు. 18 నెలలుగా గల్ఫ్ కు పంపకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారని బాధితులు జిల్లా కలెక్టర్ ను కలిశారు. నకిలీ వీసాలు, నకిలీ నియామక పత్రాలు ఇచ్చి తమని మోసం చేసారని బాధితులు ఆరోపించారు. తమ డబ్బులు తమకు ఇప్పించి నకిలీ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాల కుమార్ అందిస్తారు.

Tags:    

Similar News