TS TRANSCO: త్వరలోనే ఉద్యోగులకు వ్యాక్సిన్‌ వేస్తాం: ట్రాన్స్‌కో సీఎండీ

TS TRANSCO: విద్యుత్తు ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్‌ ను త్వరలోనే వేస్తామని దేవులపల్లి ప్రభాకర్‌రావు సోమవారం అన్నారు

Update: 2021-05-04 11:28 GMT
Devulapalli Prabhakar Rao says that the Covid Vaccine Would be Given to TS TRANSCO Employees Soon

టీఎస్ ట్రాన్స్ కో 

  • whatsapp icon

TS TRANSCO: విద్యుత్తు ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్‌ ను త్వరలోనే వేస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సోమవారం అన్నారు. ఈ మేరకు విద్యుత్‌సౌధలో ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ టీకా ఇచ్చేందుకు త్వరలోనే ఓ క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నిరంతర విద్యుత్తు సరఫరా కోసం విద్యుత్‌సౌధలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అలాగే జోనల్‌, సర్కి ల్‌ కార్యాలయాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను కోరారు. కాగా, ఉద్యోగుల కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే సిబ్బంది విధులకు హాజరు కావొద్దని సూచించారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News