Warangal: కారు ఇంజిన్‌లో డబ్బు తరలింపు.. పొగలు రావడంతో..

Warangal: ఎన్నికలవేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతయింది.

Update: 2023-11-24 10:53 GMT

Warangal: కారు ఇంజిన్‌లో డబ్బు తరలింపు.. పొగలు రావడంతో..

Warangal: ఎన్నికలవేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతయింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు కారు బానెట్‌ భాగంలో డబ్బులను అమర్చారు. వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు కారు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో కారు అక్కడికక్కడే నిలిపివేసి డ్రైవర్‌ పరారయ్యాడు. మరో వ్యక్తి కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను మరో కారులో వేసుకొని పరారయ్యారు. ఈ డబ్బు సుమారు 15 నుంచి 20 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు...ఆ డబ్బుపై విచారణ చేపట్టారు. సంఘటన స్థలాన్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు.

Tags:    

Similar News