Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 7,228 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,228 కరోనా కేసులు నమోదయ్యాయి..

Update: 2020-09-23 11:45 GMT

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,228 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కరోనా కేసుల సంఖ్య 6,46,530 కు చేరుకుంది. ఇందులో 70,357 యాక్టివ్ కేసులో ఉండగా 5,70,667 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. తాజాగా మరో 45మంది కరోనాతో పోరాడి మృతి చెందారు.. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,506కి చేరుకుంది.. ఇక గడచిన 24 గంటల్లో 68,829 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 53,02,367 కి చేరుకుంది.. 8,291 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇక తాజా కేసులలో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1112 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం లో 612, చిత్తూరులో 536, గుంటూరులో 648, కడపలో 600, కృష్ణా జిల్లాలో 428, కర్నూలు జిల్లాలో మరో 229, నెల్లూరులో 479, ప్రకాశంలో 502, శ్రీకాకుళంలో 319, విశాఖపట్నంలో 414, విజయనగరంలో 387, వెస్ట్ గోదావరి లో 962 కేసులు నమోదయ్యాయి.. ఇక చిత్తూరు 07, ప్రకాశం 07, కృష్ణా 05, తూర్పుగోదావరి 04, పశ్చిమగోదావరి 04, విశాఖపట్నం 04, అనంతపురం 03, కడప జిల్లాలో 03, నెల్లూరు 03, కర్నూలు జిల్లాలో 02, గుంటూరు 02, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు మరణించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 90,047, కర్నూల్ జిల్లా 54,720, అనంతపురం జిల్లా 54,263, పచ్చిమ గోదావరి జిల్లా 60,659, చిత్తూర్ జిల్లా 56,653, విశాఖపట్నం జిల్లా 47,824, గుంటూరు జిల్లాలో 51,232, నెల్లూరు లో 49,163, కడప 40,939, ప్రకాశం జిల్లాలో 43,710, శ్రీకాకుళం 36,893, విజయనగరం 32,597 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News